వేసవిలో భానుడి భగభగ. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వేసవిలో భానుడి భగభగ.

బల పాల పల్లెలో నీరు లేక గొంతెండుతున్న ప్రజలు
బేతంచర్ల ఏప్రిల్ 30  (way2newstv.com
బేతంచెర్ల మండల పరిధిలోని బలపాల పల్లె గ్రామంలో లో ఈ వేసవి తాపానికి మండుతున్న ఎండలకు ఊరిలో ఉన్న బోర్లలోని నీరు కూడా తగ్గిపోయింది. దీంతో అక్కడి ప్రజల పరిస్థితి చాలా దారుణంగా మారింది నీరు కావాలంటే ఎద్దుల బండి ఎక్కాల్సిందే నీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి గొంతు తడుపుకోవడానికి నీరు తెచ్చుకోవాలి పొలం పని చేసే రైతులు ఉదయాన్నే లేచి నూటికోసం కిలోమీటర్ల దూరం వెల్లి తీరాల్సిందే ఈ నీటి కష్టాలు  తప్పవా అని దేవుని వేడుకుంటున్నారు. 


వేసవిలో భానుడి భగభగ.

ఉన్న ఒకటి  ట్యాంక్యూ దగ్గర ఉన్న బోరు ఎండిపోవడంతో నీరు లేక ట్యాంక్యూ నిరుపయోగంగా పడిందని లక్షలు వెచ్చించి ఈ ట్యాంకి కట్టారని కానీ నీరు లేక ఇది నిరుపయోగంగా ఉందని అధికారులు స్పందించి తమకు దాహార్తిని తీర్చాలని ట్యాంకర్ల ద్వారా కానీ లేదంటే నూతనంగా తవ్వించి తమ నీటి సమస్యలను తీర్చాలని వారు అధికారులను కోరుకుంటున్నారు ఇది ఇలానే ఉంటే నీటి ఎద్దడితో తమ పశువులను కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కొన్నిటిని ధన లేక నీరు లేక కబేళాలకు తరలించామని ఇది ఇలాగే కొనసాగితే ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ అధికారులు మాత్రం నీటి ఎద్దడి పైన నోరుమెదపడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గ్రామాల్లో అధికారులు నీటి ఎద్దడిని గుర్తించి నివారణా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.