వరంగల్, ఏప్రిల్,10, (way2newstv.com):
చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవస్ధానంలో వికారి నామ సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమైన శ్రీ భద్రకాళీ వసంత నవరాత్రి మహోత్సవాలు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు పంచమి తిథి చైత్ర శు/పంచమిని లక్ష్మి పంచమి అని ఈ రోజు ఎవరైతే లక్ష్మిని ఆరాధిస్తారో లక్ష్మి వారి ఇంట స్ధిరంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయన ఆలయ ప్రధానార్చకలు శ్రీ భద్రకాళీ శేషు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో లక్ష్మియాగం నిర్వహించబడింది. అమ్మవారికి లక్ష పాటల పుష్పార్చన జరిగింది. శ్రీ లక్ష్మియాగంలో భాగంగా సహస్ర పద్మ పుష్పార్చన, సహస్ర కమల హవనం విధ్యారణ్య కృత శ్రీకల్పం ఆధారంగా ఈ లక్ష్మియాగం నిర్వహించబడింది.
ఐదవ రోజుకు చేరుకున్న భద్రకాథీ నవరాత్రి మహోత్సవాలు
అనంతరం అమ్మవారికి నీరాజ మంతత్ర పుష్పములు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేయబడినది. అనంతరం అశేష అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యమున వేదపండితులు పాలకుర్తి నర్సింహమూర్తి. ఈ రోజు ఉత్తర తెలంగాణా ఎన్.పి.డి.సి.ఎల్ సి యం.డి అన్నమనేని గోపాల్ రావు లక్ష్మి దంపతులు శ్రీ లక్ష్మియాగం లో పాల్గొన్నారు. వరంగల్ నగరంలో గొర్రెకుంటలో రాష్ట్రానికే రాష్ట్రానికే గర్వకారంగా రూపుదిద్ధుకుంటున్న హోల్ సేల్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో, ములంగు రోడు లోని హరిహర క్షేత్రం అయ్యప్ప దేవస్ధానంలో ప్రతిష్టింపబడుతున్న లక్ష్మి అమ్మవారి మూర్తులలో దర్శింపవచ్చిన భక్తులు కోరిన కోర్కెలు నెరవేరే విధంగా దేవకాలాసాన్నిధ్యం అమిత్గా ఉండాలని రెండు కోట్ల జనసంఖ్య లక్ష్మంతో లక్ష్మి సహస్రనామ, లక్ష్మి అష్టోత్తర శతనామ పురశ్చరణ ఈ రోజు భద్రకాళి ఆలయంలో కాకిరాల ధరిత్రి, పడిశాల సుజాతల నేతృత్వంలో వందలాది మంది నారీ మణులు ప్రారంభించారు. ఆలయ పర్యవేక్షకుడు విజయ్ కుమార్ ఆలయానికి వచ్చే సంఖ్య పెరుగుతూండటంతో ఏర్పాటు పెద్దమొత్తంలో చేయవలసినదని ఈ ఓ సునీత దేవాలయ సిబ్బందిని ఆదేశించారు.