సిద్ధిపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిద్ధిపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్

రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్
సిద్దిపేట, ఏప్రిల్ 10 (way2newstv.com)
 జిల్లాలోని సిద్ధిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాల, హుస్నాబాద్ మోడల్ స్కూల్, దుబ్బాక మోడల్ స్కూల్, గజ్వేల్ లోని ఐఓసీలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లను, కంట్రోల్ యూనిట్లను సిబ్బందికి అందజేసి పోలింగ్ కేంద్రాలకు తరలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్ లు బుధవారం ఉదయం ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సిద్ధిపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించారు. సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్న తీరుతెన్నులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రీసైడింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ లిస్ట్ చదవాలని మరోసారి అక్కడికక్కడే పీఓ, ఏపీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 


సిద్ధిపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్, 

అదే విధంగా కేటాయింపు చేసిన రూట్ల వారీగా వెళ్లే వాహనాలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. వాహనాలను ప్రారంభించారు. వేసవి కాల దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి శీతలపానీయం, సల్ల ప్యాకెట్లను అందజేశారు. అంతకు ముందు రూట్ల వారీగా ఏర్పాటైన కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో సన్నద్ధంగా ఉన్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించారు. సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్న తీరుతెన్నులను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రీసైడింగ్ అధికారులు తప్పనిసరిగా చెక్ లిస్ట్ చదవాలని మరోసారి అక్కడికక్కడే పీఓ, ఏపీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా కేటాయింపు చేసిన రూట్ల వారీగా వెళ్లే వాహనాలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. వాహనాలను ప్రారంభించారు. వేసవి కాల దృష్ట్యా ఎన్నికల సిబ్బందికి శీతలపానీయం, సల్ల ప్యాకెట్లను అందజేశారు. అంతకు ముందు రూట్ల వారీగా ఏర్పాటైన కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో సన్నద్ధంగా ఉన్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.