ఇధెలిన్ తో మామిడికి పక్వం.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇధెలిన్ తో మామిడికి పక్వం..

హైద్రాబాద్, ఏప్రిల్ 22, (way2newstv.com)
మామిడికాయలను పక్వానికి తెచ్చేందుకు దేశీయంగా తయారు చేస్తున్న ఇథెలియన్ ప్యాకెట్లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ వ్యాపారి రూపొందించిన ఫార్ములాకు హైదరాబాద్‌లోని ఐఐసిటీలో నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి హానికారకాలు లేవని తేలింది.గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ఛైర్మన్, ఎస్‌జీఎస్‌తో సదరు సంస్థ ప్రతినిధులు భేటీ అయి తమ ఇథెలిన్ పౌడర్ గురించి వివరించి వీటిని వాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు.కొన్నేళ్లుగా పరిశోధన మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన జేకే ఎంటర్‌ప్రైజెస్, కాగజ్ ప్యాకేజింగ్ సంస్థ డైరెక్టర్ రాజేందర్ కాబ్రా గత కొన్నేళ్లుగా పండ్లు, వెజిటబుల్స్‌ను ఎక్కువ కాలం మన్నిక వచ్చేలా చూసే విధానాలపై పరిశోధన చేస్తున్నారు. 


ఇధెలిన్ తో మామిడికి పక్వం..

అంతేకాక యూరప్‌లోని 14 దేశాలకు ద్రాక్షాపండ్లను ఎగుమతి చేస్తున్నారు. కాగా దేశంలో మామిడిపండ్లను పక్వానికి తెచ్చే విషయంలో కొన్నేళ్లుగా వాడుతున్న కార్బైట్, చైనా ఇథెలిన్‌లతో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి హనికారక పదార్థాలు లేకుండా పండ్లను ఇథెలిన్ గ్యాస్ విడుదల చేసి పక్వానికి తెచ్చే పౌడర్‌ను తయారు చేయాలని సంకల్పించి ఓ ఫార్ములాను హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు చెందిన తన్వీర్ ప్రూట్ కంపెనీ ప్రతినిధి అక్బర్ ఖాన్‌తో కలిసి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పరీక్షలు చేయించారు. ఇందులో తమ పౌడర్‌లో ఎలాంటి హానికారకాలు లేవని రిపోర్టు వచ్చిందని పేర్కొన్నారు.మార్కెట్ వర్గాలతో సమావేశం పండ్ల మార్కెట్ చైర్మన్, ఎస్‌జీఎస్‌లో సమావేశమైన ప్రతినిధులు కార్బైట్, చైనా ప్యాకెట్లలో ఉన్న హానికారకాలు ఏవీ లేకుండా తాము నూతనంగా రూపొందించిన ఇథలిన్ పౌడర్‌కు ఐఐసిటీ నుంచి క్లీన్ చిట్ వచ్చిందని పేర్కొంటూ జేకే ఎంటర్‌ప్రైజెస్, కాగజ్ ప్యాకేజింగ్ సంస్థ డైరెక్టర్ రాజేందర్ కాబ్రా, తన్వీర్ ప్రూట్ కంపెనీ ప్రతినిధి అక్బర్‌ఖాన్‌లు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పుటం పురుషోత్తం రావు, ఎస్‌జీఎస్ ఎల్లయ్యతో వారు సమావేశమై తమ పౌడర్ ప్యాకెట్ల గురించి వివరించారు. స్పందించిన చైర్మన్ పురుషోత్తంరావు, ఎస్‌జీఎస్‌లు నూతన దేశీయంగా తయారైన ఇథెలిన్ ప్యాకెట్లు వస్తే మంచిదేనని ఫుడ్‌సేఫ్టీ అధికారుల నుంచి, మార్కెటింగ్ శాఖ నుంచి క్లీన్‌చిట్ వస్తేనే తాము మార్కెట్ యార్డులో అనుమతించేందుకు అవకాశం ఉంటుందన్నారుమార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌ను త్వరలోనే కలిసి ఇథెలిన్ ప్యాకెట్స్ గురించి వివరిస్తామన్నారు.