రకుల్ తగ్గిపోయిందోచ్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రకుల్ తగ్గిపోయిందోచ్...

హైద్రాబాద్, ఏప్రిల్ 2, (way2newstv.com)
ప్పటికే మీడియం, స్టార్ హీరోల పక్కన అవకాశాలు కోల్పోయిన రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో అడ్జెస్ట్ అవుతుంది. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఫెయిల్ అయిన రకుల్ కి బాలీవుడ్ లో రెండు మూడు అవకాశాలున్నాయి. అక్కడ బాలీవుడ్ వాళ్లు రెడ్ కార్పెట్ పరవకపోయినా రకుల్ మాత్రం తానొక బాలీవుడ్ హీరోయిన్ అనేలా జీరో సైజుతో హంగామా చేస్తుంది. తాజాగా తెలుగు, తమిళనాట చిన్న, సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ తన రేంజ్ తగ్గించుకుంది. అయితే చిన్న, సీనియర్ హీరోలతో సినిమాలు చేసినా పారితోషకం విషయంలో మాత్రం తగ్గడం లేదనే మాట వినబడుతుంది.మన్మధుడు 2లో నాగ్ సరసన నటిస్తున్న రకుల్ రెండు కోట్ల పారితోషకం అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా రకుల్ ప్రీత్ కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. 


రకుల్ తగ్గిపోయిందోచ్...

ఫేమ్ తగ్గాక హీరోయిన్స్ అందరితో అడ్జెస్ట్ అయినట్లుగానే ఇప్పుడు రకుల్.. కళ్యాణ్ తో జోడి కడుతుంది. అంటే కాజల్, తమన్నా లాంటి వాళ్లు క్రేజ్ తగ్గగానే కళ్యాణ్ రామ్ లాంటి హీరోలతో సర్దుకుపోయారు. ప్రస్తుతం క్రేజ్ తగ్గిన కారణంగానే రకుల్.. కళ్యణ్ రామ్ సినిమా తుగ్లక్ లో నటించడానికి ఒప్పేసుకుందనే మాట వినబడుతుంది.అజయ్ దేవగన్ తో  సరదా..సరదాగాబాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, పంజాబీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘దేదే ప్యార్‌ దే’అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ట‌బు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. అకివ్ అలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రోజు అజ‌య్ దేవ‌గ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని స‌న్నివేశాలు అభిమానుల‌కి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఆశిష్( అజ‌య్ దేవ‌గ‌న్) మరియు అయేషా( ర‌కుల్ ప్రీత్ సింగ్‌) జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌ల‌ని ఫ‌న్నీగా ట్రైల‌ర్‌లో చూపించారు. అజయ్ (50) మరియు అయేషా ( 26) లండన్లో ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం కొరకు వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు సాగే జ‌ర్నీ నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు. 2017లో విడుద‌లైన గోల్‌మాల్ ఎగైన్ చిత్రం నేప‌థ్యంలోనే దేదే ప్యార్ దే చిత్రం ఉంటుంద‌ని అంటున్నారు. జావెద్ జాఫ్రే, జిమ్మీ శ్రేఘిల్‌, అలోక్ నాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.