నెల్లూరు, ఏప్రిల్ 29, (way2newstv.com)
ఏపీలో ఎన్నికల ఫలితాలకు మరో 25 రోజుల సమయం ఉండడంతో ఇప్పుడు పట్టణాల నుంచి పల్లెల వరకు ఎక్కడ చూసినా ఫలితాల గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలింగ్ ముగిసిన రోజు నుంచి జోరుగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. గెలుపు, ఓటముల సంగతి ఎలా ఉన్నా బెట్టింగుల్లో మాత్రం వైసిపి సానుభూతిపరుల స్పీడ్ ముందు టీడీపీ వాళ్లు అడుగు వెనక్కి ఉన్నారు. వైసిపి వాళ్ళు రకరకాల బెట్టింగులతో ముందుకు వస్తుంటే టిడిపి సానుభూతిపరులు వారితో పోటీ పడేందుకు వెనుకంజలోనే ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి పల్లెలోనూ రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు అనేక రకాల బెట్టింగ్‌లు జోరుగా నడుస్తున్నాయి. ఈసారి జిల్లాలో వైసీపీ బాగా పుంజుకున్న అంచనాలు వెలువడుతుండడంతో వైసిపి సానుభూతిపరులు హెచ్చు పందేలకు దిగుతున్నారు.
బెట్టింగ్ లలో హాట్ ఫేవరేట్ గా టీడీపీ
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ సానుభూతిపరులు సైతం పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పదికి తగ్గ కుండా సీట్లు గెలుస్తుందని భారీ ఎత్తున పందాలకు దిగుతుండటంతో స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో గత ఎన్నికల్లో 15 సీట్లకు టిడిపి 15 గెలుచుకుని క్లీన్‌స్విప్ చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ పది సీట్లు గెలుస్తుందని టిడిపి కేవలం నాలుగు సీట్లకు పరిమితం అవుతుందని… భీమవరంలో అయితే జనసేన లేదా అక్కడ కూడా వైసిపి గెలుస్తుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో సైతం వైసిపి 8 సీట్లు వరకు గెలుస్తుందని బెట్టింగులు కాస్తున్న ఆ పార్టీ సానుభూతిపరులు కన్ను ఇప్పుడు పశ్చిమపై పడింది. జిల్లాలో ఉన్న మధ్యవర్తుల ద్వారా ఇక్కడ వైసిపి పది సీట్లు గెలుస్తుందని కోట్లల్లో బెట్టింగ్‌లకు దిగుతుండడంతో టిడిపి వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.మరోవైపు ఇటు టీడీపీ కూడా తమకు జిల్లాలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 10కి తగ్గకుండా సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది. టీడీపీకి ఈ సారి జిల్లాలో బాగా సీట్లు తగ్గుతాయని చెపుతున్న వారు సైతం 8కు తగ్గకుండా సీట్లు తమ ఖాతాలోనే పడతాయని చెపుతున్నారు. టీడీపీ వాళ్లు ఇంత ధీమాతో ఉన్నా నెల్లూరు నుంచి వచ్చి వైసీపీ ఏకంగా 10 సీట్లలో గెలుస్తుందని మరి ఆ పార్టీ వాళ్లు పందాలు కాస్తుండడం వెనక వాళ్ల ధీమా ఏంటన్నది ? ఎవ్వరికి అంతు పట్టడం లేదు. ఏదేమైనా నెల్లూరు వైసీపీ వర్గాలు పెట్టుకున్న ఆశలను పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు నెరవేరుస్తారా ? లేదా నెల్లూరు బెట్టింగ్ రాయుళ్లు పశ్చిమలో బోల్తా పడతారా ? అన్నది చూడాలి.