మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు
అమరావతి ఏప్రిల్ 09 (way2newstv.com)
పోలవరం ప్రాజెక్టు కట్టడానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డం కాదని చెబుతున్న కేసీఆర్.. సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. అప్పుడు పోలవరంపై కేసులు వేసి.. ఇప్పుడేమో అడ్డం కాదని చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌వి అన్నీ బూటకపు హామీలేనన్నారు. దళితుడిని సీఎం చేస్తాననడం కూడా ఇలాంటిదేనని ఎద్దేవాచేశారు.
పోలవరం ఫై సుప్రీం కోర్టులో కేసులు ఎందుకు వేశారో చెప్పాలి
పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తుందా?అని ప్రశ్నించారు. 2019 జులై నాటికి గ్రావిటీతో నీరిచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. అలాంటిది పోలవరం పునాదులే దాటలేదని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగన్ తప్ప లక్షలాది మంది పోలవరం ప్రాజెక్టు చూసి సంబరపడుతున్నారని చెప్పారు.వెయ్యి కోట్ల రూపాయలకు అమ్ముడిపోయి.. కేసీఆర్ చెప్పింది జగన్ చేస్తున్నారని దేవినేని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు సామంతుడిగా మారారని ఎద్దేవాచేశారు. తనని, మంత్రి లోకేశ్‌ను ఓడించేందుకు మైలవరానికి రూ.100 కోట్లు, మంగళగిరికి రూ.200 కోట్లు కేసీఆర్, కేటీఆర్ పంపారని ఆరోపించారు. పారుపల్లి నాగేశ్వరరావు అనే దళారీ కేసీఆర్ వద్ద రూ.100 కోట్లు తీసుకొచ్చి మైలవరంలో ఖర్చు చేస్తున్నారన్నారు