ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి ఏప్రిల్ 04 (way2newstv.com)
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత గారిని ఏప్రిల్ 11 న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఊరూరా ప్రచారంలో గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓటర్లను కోరారు. గురువారం ఉదయం ప్రచారాన్ని పెద్దపల్లి మండలం చందపల్లి గ్రామం నుండి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారు ఆవుతున్నాయని పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ బీజేపీ లకు మరోసారి భంగపాటు తప్పదని అన్నారు.
కారు జోరుకు ప్రతిపక్షాల బేజారు
ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు మరోసారి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ సునీత - రాజేందర్,మార్కు లక్ష్మణ్,అక్కపాక తిరుపతి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు,సర్పంచులు, మాజీ సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు,ఎంపీటీసీలు, వివిధ కుల సంఘాల నాయకులు,గజవెల్లి పురుషోత్తం,శంకర్,మల్లేశం,రాజు, రవి,తిరుపతి,కొండి సతీష్, బొంగోని అనిల్ గౌడ్, వంశీ, పాల్గోన్నారు.