హైదరాబాద్ ఏప్రిల్ 24 (way2newstv.com)
ఇంటర్మీడియట్ పరిక్షా పలితాల అవక తవకలకు భాద్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. అన్యాయంగా 18 మంది విద్యార్థుల నిండు ప్రాణాలు బలి తీసుకున్న ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కుంభకోణం రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. రెండు-మూడు కార్పొరేట్ కాలేజీల ఒత్తిడిలో, వారి డబ్బు సంచుల ప్రలోభాలతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను లొంగదీసుకొని, 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. పరీక్ష పేపర్ వాల్యుయేషన్ ప్రైవేటు ఏజెన్సీలకు ఎలా ఇస్తారని కృష్ణయ్య ప్రశ్నించారు ? గత 71 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పరీక్షా పత్రాల వాల్యుయేషన్ జరిగాయి. కొత్తగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వవలసిన అవసరం ఏముంది? అనర్హులతో, తగిన విద్యార్హతలు లేని వారితో పరీక్ష పత్రాలను ఎలా వాల్యుయేషన్ చేస్తారు? ఇదంతా పెద్ద గందరగోళంగా ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయట పడతాయన్నారు. ముఖ్యమంత్రి ఈ సమస్యపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
భాద్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి
రెండు కార్పోరేట్ కాలేజిలు రాష్ట్రన్ని ఫీజులు / డొనేషన్ల పేరుమీద దోచుకుంటున్నారు. ఒక్కక్క విద్యార్ధి వద్ద లక్షల రూ గుంజుతు పీల్చి పిప్పిచేస్తున్నారు. ఒక్కో యాజమాన్యం క్రింద చట్ట విరుద్దంగా 400- 500 కాలేజిలు నడుపుతున్నారు. వేల సంఖ్యలో పాటశాలలు నిర్వహిస్తున్నారు. వీరికి రెండు – మూడు కాలేజీల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వరాదన్నారు. ఈ కేలేజిలపై కటిన చర్యలు తీసుకుంటేనే విద్యా వ్యవస్థ దారి కోస్తుందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన యజమాన్యలపై కటిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేట్ కాలేజీలు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించి బోర్డును, ప్రభుత్వాన్ని కొంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. దీనితోపాటు పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పడానికి బాధ్యుడైన ఇంటర్ బోర్డు అధికారులను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగం నుంచి తొలగించడం చిన్నపాటి శిక్షయే అన్నారు. ఆ కారణంగా, అన్యాయంగా 18 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ఇంటర్ బోర్డు అధికారులకు ఉరి శిక్ష వేసిన తక్కువ అన్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి కిసిఅర్ స్పందించి న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.ఇంటర్ పరీక్షా ఫలితాలలో అధికారులు చేసిన తప్పులను క్షమించరాని నేరం అన్నారు. వీరి ఘోరమైన తప్పు వలన 18 మంది చనిపోయారు, లక్షలాది మంది విద్యార్థులు ఫలితాలలో జరిగిన అవకతవకల వలన తీవ్ర మానసిక క్షోభకు గురి అయ్యారు. పరీక్షలకు హాజరైన వారికి గైర్ హాజరని ఫెయిల్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి సెకండ్ ఇయర్ లో జీరో మార్కులు వేసి ఫెయిల్ చేయడం క్షమించరాని నేరం. ఇలా ఇంటర్ బోర్డు అధికారుల లీలలు చెప్పతరం కాదు. అధికారులు ఫలితాలు –మార్కులను వెరిఫికేషన్ చేయకుండా రిజల్ట్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ ఫలితాలను రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ పేరున జాప్యం చేయకుండా మొత్తం పేపర్లను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు స్పందించడాన్ని ప్రభుత్వం భాద్యతా యుతంగా తీసుకొని పాజిటివ్ గా తీసుకొని సమస్య జటిలం కాకుండా పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిన ఇంటర్ మీడియట్ అధికారులను అరెస్టు చేయకుండ – తప్పులను సరిచేయమని విజ్ఞప్తి చేయడానికి వచ్చిన విద్యార్థులను – వారి తల్లిదండ్రులను నిర్దక్షన్యంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఏబివిపి – రాష్ట్ర నాయకులు అయ్యప్ప చేతులకు బేడీలు వేసి అరెస్టు చేయడాన్ని కృష్ణయ్య తీవ్రంగా ఖందించారు. మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా? లేక రాజకీయ వ్యవస్థలో ఉన్నామా అని ప్రశ్నించారు.