రానున్న రోజుల్లోతెలంగాణా మరింత అభివృద్ధి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రానున్న రోజుల్లోతెలంగాణా మరింత అభివృద్ధి

నిజామాబాద్ జిల్లా చెంగల్‌లో ఎంపీ కవిత రోడ్ షో
నిజామాబాద్ ఏప్రిల్ 5 (way2newstv.com):  
రాష్ర్టాభివృద్ధికి ఈ ఐదేళ్లలో చేయాల్సినవి చేశాం.. ఇంకా చేయాల్సినవి పనులు ఉన్నాయి.. వాటిని కూడా రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని.. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఎంపీ కవిత అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చెంగల్‌లో ఎంపీ కవిత రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి పరీక్షలే కాదు త్వరలో అన్ని ఆరోగ్య పరీక్షలు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీలు కథలు చెబుతాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అన్నారు. కేంద్రం బీడీ పరిశ్రమలను ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదన్నారు. 


రానున్న రోజుల్లోతెలంగాణా మరింత అభివృద్ధి 

దేశంలో 13 రాష్ర్టాల్లో బీడీ కార్మికులున్నారు. కేవలం తెలంగాణలోని బీడీ కార్మికులకు మాత్రమే ఫించన్ అందుతుందన్నారు. జాతీయ పార్టీలు అని పేరు చెప్పుకోవటం కాదు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేయాలన్నారు. మనది ప్రాంతీయ పార్టీ అయినా ఐదేళ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కరెంట్ లేదు. కానీ ఐదేళ్లలో తెలంగాణలో 24 గంటలు కరెంట్ చేస్త్తున్నామన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా 100శాతం సబ్సిడీతో అన్ని వర్గాల ప్రజలకు రూ. 50 వేలు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు అదనంగా ఆదాయం వచ్చేలా అనేక రకాల వ్యవసాయ వస్తువులు తయారు చేయిస్తామన్నారు. అక్కా చెళ్లెళ్లు దీవించటం వల్లే కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యారన్నారు.మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవలం నాలుగు నెలల్లో కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీ నింపుతామన్నారు. భీంగల్ మండలానికి సాగు, తాగు నీటి కొరత ఉండదన్నారు. పసుపు బోర్డు కోసం కోట్లాడిన కవిత పైన కావాలని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. పసుపు బోర్డు కోసం ఆరుగురు సీఎంలను కలిశారు. ప్రధానికి లేఖ రాశారు. పసుపు బోర్డు కోసం పార్లమెంట్‌లో మాట్లాడిన నాయకుడు మరొకరు లేరన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 12ఈవీఎంలు ఉంటాయి. పరేషాన్ కావద్దు. కారు గుర్తును చూసి ఓటెయ్యండని పేర్కొన్నారు.