పల్లెకు వెలుగులు (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లెకు వెలుగులు (నెల్లూరు)

నెల్లూరు, ఏప్రిల్ 08 (way2newstv.com) : 
జిల్లా వ్యాప్తంగా ఉన్న 940 పల్లెసీమల్లో తప్పనిసరిగా ఎల్‌ఈడీ బల్బులు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలందడంతో జిల్లా అధికారులు కూడా ఆ దిశగా అడుగులు శరవేగంగా ముందుకు వేశారు.. ఈ సంకల్పాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ నెరవేర్చింది. దాదాపు 2,03,426 విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిలో దాదాపు 90 శాతం ఏర్పాటయ్యాయి. దీనికి ప్రతి స్తంభానికి ప్రత్యేకంగా మూడో విద్యుత్తు సరఫరా లైన్‌ను వేశారు.అమరావతి నుంచి పంచాయతీరాజ్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు కూడ ప్రత్యేక అధికారుల బృందం వచ్చింది. పల్లెల్లో 40, 60 వోల్టుల బల్బులను వినియోగిస్తున్నారు. 90 శాతం ప్రాంతాలకు 24 వోల్టేజీల బల్బులుతోను, 32 వోల్టేజీతో 7 శాతం ప్రాంతాలు, 75 వోల్టేజీల బల్బులతో 3 శాతం ప్రాంతాల్లో 


పల్లెకు వెలుగులు (నెల్లూరు)

లైట్లు కళకళలాడతున్నాయి.మనుబోలులోని అక్కంపేట, టీపీగూడూరులోని వరకవిపూడి, కావలిలోని ఆర్‌సీపాలెం, వింజమూరు తదితర గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. 775 గ్రామాలకు ఎల్‌ఈడీ బల్బుల సిస్టం పూర్తయింది.జిల్లాలోని ప్రతి పల్లెసీమల్లో వెలుగుజిలుగులు కళకళలాడుతున్నాయి.. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గతంలో ఎన్నడులేని విధంగా 775 గ్రామాల్లో ఎల్‌ఈడీ వెలుగులు సిద్దం అయ్యాయి. నగరాలకు పోటీగా వీధి దీపాలను ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ బల్బులతో పల్లెసీమల్లో రాత్రివేళల్లో కళకళలాడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూలేని విధంగా పల్లె సీమల్లో ఎల్‌ఈడీ సోయగాలతో రోడ్లు అందంగా మారాయి.. జిల్లా వ్యాప్తంగా ఎల్‌ఈడీ వెలగులు వెలిగించే శుభముహూర్తం రానే వచ్చింది. జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన అధికారులు పనులను వేగవంతం చేశారు.