హైద్రాబాద్, ఏప్రిల్ 29 (way2newstv.com)
ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌తో ‘జైసింహా’ సినిమా చేసిన నందమూరి బాలకృష్ణ.. ఆ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ తరవాత బాలకృష్ణ ప్రకటించిన సినిమా ఇది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభంకానుంది. రామోజీ ఫిలింసిటీలో తొలి షెడ్యూల్ ప్రారంభమవుతుందని సమాచారం. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేయడం కొత్తేమీకాదు.
మళ్లీ బాలయ్య వర్సెస్ జగపతిబాబు
‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల్లోనూ ఆయన డ్యుయల్ రోల్ పోషించారు. ఇప్పుడు మరోసారి ద్విపాత్రాభినయంతో అభిమానులకు అదిరిపోయే ఫీస్ట్ ఇవ్వబోతున్నారని టాక్. ఇక ఈ చిత్రంలో విలన్‌గా జగపతిబాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే మరోసారి బాలయ్యను జగపతిబాబు ఢీకొట్టబోతున్నారన్నమాట. వాస్తవానికి బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక అప్పటి నుంచి జగపతిబాబుకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోనే ది బెస్ట్ విలన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు మరోసారి బాలయ్య పక్కన జగపతిబాబు విలన్‌గా చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం హీరోయిన్ వేటలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.