యదేఛ్చగా అక్రమ గ్యాస్ సిలెండర్ల దందా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యదేఛ్చగా అక్రమ గ్యాస్ సిలెండర్ల దందా

అదిలాబాద్, ఏప్రిల్ 10, (way2newstv.com)
అదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది.  పట్టణాలు, పల్లెల నుంచి సిలిండర్లు నల్లబజారుకు తరలుతున్నాయి. గృహావసరాలకు ఉపయోగించే రాయితీ సిలిండర్లను వ్యాపారం కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తదితరాల్లో గృహావసారాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు.పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే ‘డొమెస్టిక్’ సిలిండర్లను యథేచ్చగా కొందరు వ్యాపార అవసరాలకు వినియోగి స్తున్నారు. దీనిని ఓ దందాగా మార్చేసి కొన్ని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమంగా దండుకుంటున్నారు. పేదల సిలిండ ర్ల మార్పిడి తంతును అక్రమంగా నిర్వ హిస్తున్నారు. ఇక కొన్ని గ్యాస్ ఏజెన్సీల్లో ఒక్కో సిలిండర్ పై అదనంగా డబ్బులు వసూలు చేస్తూ సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారిపట్టిస్తూ అక్రమ దందాసాగిస్తున్నాయి. 


యదేఛ్చగా అక్రమ గ్యాస్ సిలెండర్ల దందా

ఉమ్మడి ఆది లా బాద్ జిల్లాలోని పట్టణాలతో పాటు ప్రధానంగా మండల కేంద్రాల్లో జోరుగా సబ్సిడీ గ్యాస్ అక్రమ దందానడుస్తోంది. నిబంధనలకు విరు ద్దంగా హోటళ్లు, ఫాస్ట్‌పుడ్, టిఫిన్ సెంటర్లలో గృహ అవసరాలకు వినియో గించే సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు కొందరు ఏజెన్సీదారు లకు తెర చాటున ఇదొక వ్యాపారంగా మారిందని అంటున్నారు. అధి కంగా సిలిండర్లు వినియోగించే ప్రధాన తనిఖీలు నిర్వహించి చేతులు దులపుకుంటున్నారనే విమర్శలున్నాయి.జిల్లాలో అధికారులు 2010 నుంచి ఐదేళ్లుగా పలుమార్లు దాడులు నిర్వహించి 688 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నా రు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 374 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 5న ఆదిలాబాద్, నిర్మల్‌లలో దాడులు నిర్వహించి 45 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 21 కేసులు నమోదు చేశారు. వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.. గ్యాస్ వినియోగం ఎక్కువ కావడంతో కమర్షియల్ సిలిండర్లు కాకుండా డొమెస్టిస్ సిలండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టడంతో పాటు కమర్షియల్ గ్యాస్ వినియోగం పెరగేలా చూడడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పక్కదారి పట్టకుండా చూడవచ్చని అంటున్నారు.