పట్టణంలో దొంగలు హల్ చల్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పట్టణంలో దొంగలు హల్ చల్

వరుసగా మూడు ఇళ్లల్లో చోరీ
ఎమ్మిగనూరు ఏప్రిల్ 30  (way2newstv.com
పట్టణంలోని లక్ష్మణ్ టాకీస్ వెనుక ఉన్న వరుస ఇండ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.దాదాపు పదిహేను తులాల బంగారు 40 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైయ్యాయి.ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మణ్ ధియేటర్ వెనకాల మూడు ఇళ్లలో చోరీ జరిగిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కాలనీలో   మొదటి ఇల్లు  రెండవ ఇల్లు చోరీలకు ప్రయత్నించి విఫలం అయ్యి పక్కనే ఉన్న ఇంటి తాళాలు వేసిన ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి దుండగులు ప్రవేశించి బీరువా లో దాచిన పదిహేను తులాల బంగారు 40 తులాల వెండిని దొంగలించుకుని వెళ్లారు.  


పట్టణంలో దొంగలు హల్ చల్

బాధితురాలు సురేఖ మాట్లాడుతూ బీరువాలో దాచిన పదిహేను తులాల బంగారు 40 తులాల వెండిని చోరీకి గురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం రాత్రి సురేఖ భర్త హైదరాబాదుకు వెళ్లగా,తాను రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి దగ్గరకు వెళ్లానని దీన్ని అదునుగా చేసుకున్న దుండగులు చోరీకి పాల్పడినట్లు బాధితురాలు సురేఖ తెలిపింది. వరుస చోరీలు జరిగిన విషయాన్ని తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ లను రప్పించి పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని ఆయన అన్నారు.