కేసీఆర్ జిత్తుల మారి నక్క - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ జిత్తుల మారి నక్క

గుంటూరు, ఏప్రల్ 9, (way2newstv.com
తొలి విడత ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో ముగింపు పడుతున్న వేళ కేసీఆర్, వైఎస్ జగన్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గుంటూరు జిల్లా గురజాలలో మంగళవారం (ఏప్రిల్ 9) జరిగిన రోడ్‌షోలో ఈ ఇరువురు నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిస్తా అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మడానికి వీల్లేదని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ జిత్తులమారి నక్క లాంటోడని.. మాట మార్చడంలో దిట్ట అని మండిపడ్డారు. హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీఆర్‌ఎస్ ఎందుకు సహకరించలేదని, సోనియా గాంధీ ఏపీకి హోదా ఇస్తానని చెప్పినప్పుడు ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ లోటస్ పాండ్‌లో కూర్చొని కేసీఆర్‌కు ఊడిగం చేస్తున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇద్దరూ కలిసి ఏపీలో ఏడున్నర లక్షల ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. వైఎస్ జగన్ వెనక కేసీఆర్, మోదీ ఉన్నారని.. ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముగ్గురు కలవకపోతే ఏపీలో కక్ష సాధింపు పనులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. 


కేసీఆర్ జిత్తుల మారి నక్క

ఏపీ ప్రజలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నాడు. బండబూతులు తిడుతున్నాడు. నేను సన్నాసినా.. ఏం తమ్ముళ్లూ మీ ముఖ్యమంత్రి సన్నాసేనా? ఏం చెల్లెమ్మలూ మీకు కోపం రాలేదా? ఏపీ ప్రజలను కేసీఆర్ ఎంతలా అవమానించాడు.. మన బిర్యానీ పేడలా ఉంటుందన్నాడు. మన ఉలవ చారు వాళ్ల దగ్గర పశువులకు పెడతామని తిట్టాడు. ఇలాంటి కేసీఆర్ మాటలను మీరు నమ్ముతారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్, జగన్.. ఇద్దరూ నరేంద్ర మోదీ పెంపుడు కుక్కలు అంటూ చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి మోదీ నమ్మక ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణపైన, కోడికత్తి పార్టీ పైన, మోదీ పైన పల్నాటి పౌరుషం చూపించాలి..’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం తనను చూసి ఓటేయాలని ఏపీ ప్రజలను చంద్రబాబు కోరారు. ‘మీ ఎంపీ అభ్యర్థిని నేనే.. ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే. మీకు సంబంధించిన పనులన్నీ చేసే బాధ్యత నాదీ నాదీ నాది అని చెబుతున్నా. మీకు అభ్యర్థులపై లేదా అధికారులపై ఎక్కడన్నా అసంతృప్రతి ఉన్నా.. నన్ను చూసి ఓటేయండి. అభివృద్ధి చూసి.. భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఓటేయండి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.ఆంధ్ర జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందాం’ అంటూ ప్రజలతో చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు భావితరాల భవిష్యత్తుకు, యువత భవిష్యత్తుకు సంబంధించినవి తెలిపారు. కులాలు, మతాలు చూసి పనులు చేయట్లేదని స్పష్టం చేశారు. ‘రేపు, ఎల్లుండి హుషారుగా ఉండండి.. ఒక్క ఓటు కూడా బయటివారికి వెళ్లకుండా చూడండి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. మోడీపై అధికారులు కంప్లయింట్ ఇచ్చారు జగన్, కేసీఆర్, మోదీ ముగ్గురినీ కట్టకట్టి బంగాళాఖాతంలో పారేయాలని పిలుపునిచ్చారు. "మనకి అన్యాయం జరిగిందా? లేదా?. మోదీ న్యాయం చేశాడా? నమ్మకద్రోహం జరిగిందా? లేదా? వెంకన్నను కూడా మోసం చేసిన వ్యక్తి మోదీ. ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం చేశాడు. ఈ రోజు 66 మంద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఎన్నికల సంఘం మోదీ ఆధ్వర్యంలో పనిచేస్తోందని ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్రపతి గారూ మీరు జోక్యం చేసుకోండి, ఈసీకి స్వయంప్రతిపత్తి లేదు, ఇది దేశానికి మంచిది కాదని ఫిర్యాదు చేశారంటే ఇది మోదీ అన్యాయ పాలనకు పరాకాష్ట తప్ప మరోటి కాదు. నేను సంవత్సరం నుంచి పోరాడుతున్నా. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఆర్బీఐని కుప్పకూల్చారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా ఉపయోగించుకుని మనపై దాడులు చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమరపాటుగా ఉంటే ఇవే మనకు చివరి ఎన్నికలు అవుతాయి" అంటూ ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు.