మహబూబ్ నగర్, ఏప్రిల్,05 (way2newstv.com):
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వపూర్, పెద్ద రాజమూర్, నాగరం, కోయిలసాగర్ గ్రామాల నుండి కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే. అరుణ, డోకూర్ పవన్ కుమార్ సమక్షంలో భారీగా బిజెపి పార్టీలోకి చేరారు. బిజెపిలో చేరినవారిలో దేవరకద్ర నియోజకవర్గ శక్తి ప్రాజెక్టు కోఆర్డినేటర్ అంజన్ కుమార్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మసిరెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ గొల్ల కృష్ణయ్య, మాజీ వార్డు మెంబర్ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
దేవరకద్ర లో బిజెపి పార్టీలోకి వలసల వెల్లువ
పెద్ద రాజమూర్ గ్రామం నుండి రాఘవరెడ్డి, చంటి, మ్యాకల ఆంజనేయులు, బాబురెడ్డి, వెంకట్ రెడ్డి, శేఖర్, నాగేశ్వర్ రెడ్డి, అంజల్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీను, శశికుమార్ రెడ్డి, పెంటయ్య, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కార్తిక్, భారత్ కుమార్, నవీన్, సాయికుమార్, శివ, చెన్నకేశవులు, జనార్దన్ రెడ్డి, వెంకటేష్ తదితరులు చేరారు. బస్వాపూర్, బాబు, అరవింద్ కుమార్, నవీన్, రవి తదితరులు, నాగరం నుంచి వెంకట్రామిరెడ్డి, శేఖర్ రెడ్డి, అనంతయ్య, రాజన్న, చిన్న రాజన్న, ఆశన్న, ఆటో ఆంజనేయులు, మల్లేష్, చిన్న రాజన్న తదితరులు., కోయిలసాగర్ నుంచి రాములు, బచ్చన్న, బతకన్న, ఆంజనేయులు, రాజు తదితరులు బిజెపి పార్టీలోకి చేరారు.