అమరావతి ఏప్రిల్ 25 (way2newstv.com)
వెంకన్న స్వామిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. స్వామి బంగారం పై కూడా వైసీపీ రాజకీయాలు చేయడం దారుణం. సీఎస్ ని ఒక పావుగా చేసుకొని వైసీపీ రాజకీయాలు చేస్తుంది. ఒక రాజ్యసభ సభ్యుడు అయి ఉండి విజయసాయిరెడ్డి సభ్యత లేకుండా మాట్లాడటం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు.
సభ్యతలేని విజయ్ సాయి మాటలు
వైసీపీ నేతలు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. ప్రపంచం కొలిచే వెంకన్న స్మామి బంగారంపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. సీఎస్ ఈసీ చేతిలో పావుగా మారారని ఆరోపించారు. పసుపు కుంకుమ డబ్బులు మహిళలకు అందకుండా సీఎస్ కుట్ర పన్నుతున్నారు. ప్రజల సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ప్రజలే తరిమి కొడతారని వ్యాఖ్యానించారు.