కరీంనగర్ ఏప్రిల్ 9 (way2newstv.com )
కరీంనగర్ లోక్‌సభ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో గడువు పూర్తికానున్న నేపథ్యంలో విజయ సంకల్ప యాత్ర పేరుతో కరీంగనర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
భాజపా ఎంపీ అభ్యర్థి సంజయ్ కు అస్వస్థత
ఇందులో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చౌరస్తాకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రచార వాహనంలోనే సంజయ్ కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కార్యకర్తలు, నేతలు ఆయనను అంబులెన్స్‌లో సమీపంలోని అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు. ఎండల తీవ్రతతో సంజయ్ అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయినట్టు వైద్యులు తెలిపారు.