కాకినాడ, ఏప్రిల్ 03 (way2newstv.com)
గత 5 సంవత్సరాలుగా కాకినాడ నగరంలో 150 కోట్ల రూపాయలు అవినీతి సొమ్మును సంపాదించని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఎక్కడ ప్రచారానికి వెళ్లినా, నగర ప్రజలు అక్కడ ప్రశ్నించాలని వైకాపా కాకినాడ నగర శాసనసభ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓట్లరను కోరారు. బుధవారం నాడు స్థానిక 18 వ డివిజన్ మరిడమ్మ పేటలో నిర్వహించిన ప్రచారంలో భాగంగా ద్వారపూడి మాట్లాడుతూ నగర ప్రజలు కొండబాబుకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా నగరంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని పైగా నగర ప్రజలపై దోచుకు తినడం మొదలుపెట్టారన్నారు.
కొండబాబు అవినీతిని ప్రశ్నించండి
కొండబాబు అవినీతికి చమరగీతం పడాల్సిన సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మహిళల రుణమాఫీ, మద్యపాన నిషేధం, అమ్మవడి, ఫీజు రియంబర్స్ వంటి పథకాలు ఎన్నో ఉన్నాయని ఒకసారి వైకాపా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ధోని చిట్టిబాబు, కర్రీ నారాయణ, విల్లా సత్యనారాయణ, తిరుమల, మూర్తి,మోస రాజు తదితరులు పాల్గొన్నారు.