తమిళ తంబీల చూపెటు..? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తమిళ తంబీల చూపెటు..?

చెన్నై, ఏప్రిల్ 2, (way2newstv.com)
తమిళనాడులో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపుకోసం కృషి చేస్తున్నాయి. రెండు పార్టీలకు జనాకర్షణ గల నేత లేకపోవడం ఈ ఎన్నికల విశేషంగానే చెప్పుకోవాలి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో పన్నీర్ సెల్వం, పళనిస్వామిలే ఆ పార్టీ కి మెయిన్ ఫేస్ గా మారారు. ఇక డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి మరణంతో స్టాలిన్ పార్టీ పగ్గాలు అందుకున్నా తండ్రి అంతటి ఛరిష్మా లేదన్నది వాస్తవం.
ఇద్దరూ లేకుండా…..కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు హోరాహోరీ తలపడుతున్నాయి. జయలలిత, కరుణానిధి కొన్నేళ్లుగా సాధించి పెట్టిన ఓటు బ్యాంకుపైనే వీరు నమ్మకం పెట్టుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు జనాన్ని పెద్దగా ప్రభావం చేయలేరు. 


తమిళ తంబీల చూపెటు..?

ఇక డీఎంకే కూడా కరుణానిధి అంతటి సమర్థ నాయకుడు స్టాలిన్ కాదన్నది ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం. దీంతో ప్రజలు ఎవరివైపు మొగ్గుతారన్నది తమిళనాట ఆసక్తిగా మారింది.అయితే ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏడాదిన్నర క్రితం మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ తరుపున అభ్యర్థులను కమల్ హాసన్ బరిలోకి దించారు. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కమల్ హాసన్ మాత్రమే. మరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కమల్ హాసన్ ఏ మేరకు ఓట్లను చీల్చగలుతారు? ఎవరిని దెబ్బకొడతారన్న చర్చ తమిళనాట జోరుగా జరుగుతోంది.తమిళనాడులో 40 లోక్ సభ స్థానాలు, 18 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొత్త వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నారు. మార్పుకోసమే తాను వచ్చానని చెబుతున్న కమల్ హాసన్ తన పార్టీ అభ్యర్థులుగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనివారిని ఎంపిక చేయడం కొంత కలసి వస్తుందంటన్నారు. అభ్యర్థుల్లో ఎక్కువగా రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆరోపణలు లేని పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. తమకు ఒక్క ఛాన్సివ్వండంటూ ప్రజల ముందుకు కమల్ హాసన్ వెళుతున్నారు. మరి జయలలిత, కరుణానిధి లేని ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాల్సి ఉంది.