భారత సైనిక చరిత్ర లో నూతనాధ్యాయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారత సైనిక చరిత్ర లో నూతనాధ్యాయం

సైన్యంలోకి మహిళల రిక్రూట్ మెంట్ మొదలు
న్యూ డిల్లీ ఏప్రిల్ 25 (way2newstv.com)  
గురువారం నాడు భారత సైనిక చరిత్ర లో నూతనాధ్యాయం మొదలయింది. ఇంతవరకు పురుషులకే పరిమితమయిన సైన్యం లోని కొన్ని ఉద్యోగాలను ఇపుడు మహిళలకు అందుబాటులోకి తెస్తున్నారు.సైన్యంలోకి మహిళలను రిక్రూట్ చేసుకోవడం ఈ రోజు నుంచి మొదలయింది. మిలిటరీలో యుద్ధంతో సంబంధం లేని విభాగాలలో జవాన్లుగా మహిళలను నియమించేందుకు గురువారంనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.కోర్ ఆఫ్ మిలిటరీ పోలీసులోకి నియామకాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలయింది. 


భారత సైనిక చరిత్ర లో నూతనాధ్యాయం 

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జూన్ 8. ఈ విభాగం యుద్ధ విధులను నిర్వర్తించదు. వీరిని సోల్జర్ జనరల్ డ్యూటీ అని పిలుస్తారు.ఇంతవరకు ఆర్మీలో మహిళలను ఆధికారుల ర్యాంక్ లోనే నియమించే వారు. ఇపుడు జవాన్లుగా కూడా మహిళలను తీసుకోవడం ఇదే మొదటిసారి.మిలిటరీ పోలీస్ లోకి మహిళలను తీసుకోవాలనుకునే ప్రతిపాదనకు జనవరిలోనే రక్షణ శాఖ ఆమోదం పొందింది. సైన్యంలోని మూడు విభాగాలలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రతిపాదనను చాలా అధ్యయనం తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఇది ఒక మహిళ రక్షణ మంత్రిగా ఉన్నందుకే సాధ్యమయిందేమో. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పదవీ కాలంలో తీసుకున్న ఒక విప్ల వాత్మక నిర్ణయం గా పేర్కొనవచ్చు.