విశాఖలో ఆ ముగ్గురు సీన్ ఎంత - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖలో ఆ ముగ్గురు సీన్ ఎంత

విశాఖపట్టణం, ఏప్రిల్ 29, (way2newstv.com)
విశాఖ జిల్లాలో రాజకీయంగా ముగ్గురు మిత్రులు ఉన్నారు. వారు ఏం చేసినా విజయమే. అటువంటి ముగ్గురు మిత్రులు తాజా ఎన్నికల్లో మాత్రం వేరు అయ్యారు. అయితే వారు మళ్లీ విజేతలుగా నిలిచి రికార్డ్ సృష్టిస్తారా అన్నది ఇపుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది. వారే మంత్రి గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు. ఈ ముగ్గురూ 2009 నుంచి ఒక్కటిగా ఉంటూ వచ్చారు. గంటా టీడీపీ నుంచి రాజకీయ అరంగ్రేట్రం చేస్తే ప్రజారాజ్యం నుంచి అవంతి, పంచకర్ల ఎమ్మెల్యేలుగా నెగ్గారు. అప్పటి నుంచి వీరంతా నియోజకవర్గాలు మార్చినా గెలుస్తూనే ఉన్నారు.ఇక ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఈ ముగ్గురూ 2014 ఎన్నికలకు ముంది టీడీపీలోకి చేరిపోయారు. 


విశాఖలో ఆ ముగ్గురు సీన్ ఎంత

2009 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి గెలిచిన అవంతి శ్రీనివాసరావు 2014 నాటికి అనకాపల్లి నుంచి ఎంపీగా టీడీపీ నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో పెందుర్తి నుంచి ప్రజారాజ్యం తరఫున గెలిచిన పంచకర్ల 2014లో టీడీపీ తరఫున ఎలమంచిలి ఉంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అదే విధంగా 2009లో అనకాపల్లి నుంచి గెలిచి మంత్రి అయిన గంటా 2014 నాటికి భీమునిపట్నం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలాగే మళ్ళీ మంత్రి కూడా అయ్యారు.ఇక 2009 నాటికి మిత్రుల మధ్య రాజకీయం చిచ్చు రేపింది. భీమిలీ టికెట్ కోరుకున్న అవంతి టీడీపీ నుంచి వైసీఎపీలోకి మారి మరీ దాన్ని సాధించారు. గంటా తాను భీమిలీ వీడను అంటూనే చివరి నిముషంలో విశాఖ నార్త్ నుంచి పోటీ చేశారు. ఇక పంచకర్ల రమేష్ బాబు మాత్రం ఎలమంచిలి నుంచే మళ్ళీ పోటీ చేశారు. ఇపుడు వీరి విజయావకాశాలు ఎలా ఉంటాయోనని అంతా చర్చించుకుంటున్నారు. భీమిలి నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఉన్న అవంతి విజయం ఖాయమన్న మాట వినిపిస్తోంది. పదేళ్ళ కెరీర్లో నాలుగు పార్టీలు మారిన ఆయన తన సత్తా చాటుకుని గెలుపు బాటలో ఉండడం రికార్డ్. అదే విధంగా విశాఖ నార్త్ నుంచి గంటా గెలుస్తారనే అంటున్నా కొంత డౌట్ ఉంది అంటున్నారు. ఒకవేళ గంటా పరాజయం పాలు అయితే అది పెద్ద రికార్డ్ అవుతుంది. ఇక ఎలమంచిలి నుంచి పోటీకి దిగిన పంచకర్లకు టఫ్ ఫైట్ ఉంది అంటున్నారు. ఆయన గెలిస్తే రికార్డ్. ఓడితే మాత్రం. కెరీర్ దెబ్బ తిన్నట్లే. చూడాలి మరి ఫలితాలు ఏం చెబుతాయో.