హైదరాబాద్ ఏప్రిల్ 26 (way2newstv.com)
బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా బాసా సత్యనారాయణ,రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఓ.శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రావు (కొల్లాపూర్)లను నియమితులైనారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా. కె.లక్ష్మన్ వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారి చేసారు.
కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులుగా బాసా సత్యనారాయణ
తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తుందని పార్టీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.ఈ సందర్బంగా రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి మరింత తోడ్పాటు అందిస్తారని ఆశిస్తూ నూతనంగా నియమితులైన వారికి డా. లక్ష్మన్ అభినందనలు తెలిపారు.