అభివృద్ధినీ చూసి ఓటు వేయండి
రోడ్ షో ప్రచార యాత్ర లో తిక్క రెడ్డి
కౌతాళం ఏప్రిల్,05 (way2newstv.com):
జగన్ కు ఓటేస్తే మోడీకి వేసినట్లు అని అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని శుక్రవారం కామవరం లో రోడ్ షో ప్రచార యాత్ర లో తిక్కా రెడ్డి పేర్కొన్నారు. నియోజక వర్గంలో రెండు సార్లు ఓడిపోయిన అభివృద్ధి చేసి చూపించారు. ఓటు వేసే ముందు అభివృద్ధిని చూసి ఓటు వెయ్యండి అని రెండు చేతులు జోడించి అడుగు తున్న నా భర్తకు ఓటు వేసి గెలిపించాలని,కాలుకి బుల్లెట్ తగిలి ఆరోగ్యం సహకరించక పోయిన ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పాటు పడే నా భర్త ఈ లాంటి సమయంలో కూడా మీ దగ్గర కొచ్చి ఓట్లు అడుగు తున్నము సైకిల్ ఓటు వేసి గెలిపించాలని మరి మరి గ్రామాల్లో ప్రజలను తిక్క రెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ కోరారు. ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేసి గెలిపించాలని టిడిపి అభ్యర్థి పాలకుర్తి తిక్కా రెడ్డి తెలిపారు.
జగన్ కు ఓటు వేస్తే మోడీ కి వేసినట్టే
రెండు సార్లు బాల నాగి రెడ్డి కి వేశారు. ఇంటికే పరిమితం అయ్యారు. అభివృద్ధి జరగలేదు నేను అభివృద్ధి చేసి చూపించాను. ఈ సారి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు ఆదరించి తెలుగుదేశం అభివృద్ధికి కు ఓటు వేయాలని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల పరిధిలో కమవరము, ఊరుకుంద, మల్లన్న హట్టి చిరుత పల్లి, కట్రికీ , సులేకెరీ, బంటకుంట, తదితర గ్రామములో ప్రచార యాత్రను రోడ్ షో లు ముమ్మరం చేశారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని అభివృద్ధికి తోడుండాలని ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి ఏమిటో చూపిస్తాం అని తన సత్తా చాటుతానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిస్తనని హామీ ఇచ్చారు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు అభివృద్ధి ఏంటో చూపిస్తానని ప్రచార యాత్రలో ప్రజలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేశ్వరమ్మ,, ఉలి గాయ్య, గుడిసె శివన్న, సుదీర్ రెడ్డి, సురేష్ నాయుడు వెంకటపతి రాజు, సతీష్ నాయుడు, రామలింగ ,కోటేష్ గౌడ్, టిప్పు సుల్తాన్, చౌదరి బసవ, సిద్దు సాయిబాబా తదితర నాయకులు కార్యకర్తలు సి బి ఎన్ బృందం భారీ సంఖ్యలో పాల్గొన్నారు.