కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు

టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లు రవి
హైదరాబద్ ఏప్రిల్ 12 (way2newstv.com)
కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.శుక్రవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పార్లమెంట్ లో  కాంగ్రెస్ కు అనుకూలంగా అనూహ్య ఫలితాలు రాబోతున్నాయన్నారు.నేను లక్షా యాభై వేల మెజారిటీతో నాగర్ కర్నూల్ ఎంపీగా గెలవబోతున్న్ననన్న ధీమా వ్యక్తం చేసారు. టీఆరెస్ కు ఓటేస్తే మోడీనే పీఎం అవుతారని గమనించిన ప్రజలు..ఇపుడు కాంగ్రెస్ కు ఓటేశారన్నారు. 


కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు

పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు పరాభవం తప్పదన్నారు. కేసీఆర్ నియంత పాలనపై ప్రజలు విసిగి పోయారని, కాంగ్రెస్ ను గెలిపించాలని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టిఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని గోబెల్ ప్రచారం చేసింది. టిఆర్ఎస్ అనూహ్య పరిణామాలు దురుకోనుందన్నారు. టిఆర్ఎస్, బీజేపీ ఒకటేనని తెలంగాణ ప్రజలు నమ్మారు. కనీస ఆదాయ పథకం బాగా ప్రభావం చూపింది. నెలకి 6 వేల రూపాయల పథకం, రైతులకు 2 లక్షల రుణ మాఫీ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. ఇవన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు.జడ్చెర్ల ఇంఛార్జిగా ఎవరిని నియమించలేదు.. అనిరుద్ రెడ్డి కోఆర్డినేటర్ మాత్రమే కొనసాగుతున్నరన్నారు.