శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20, (way2newstv.com)
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతంలో ఈ మధ్య జరిగిన దొంగతనాన్ని ఎట్టకేలకు పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకున్నారు. శ్రీకాళహస్తి లో శ్రీరాంనగర్ కాలనీ లో కాపురం ఉంటున్న ఆనంతాచారి ఇంట్లో ఈ నెల 14 వ తేదీన ఆ ఇంట్లో పనిచేస్తున్న తలపరెడ్డి మాణిక్యం (19), గుడ్లు జయచంద్ర కొంతకాలంగా ఇంటిని పరిశీలిస్తు సమయం చూసి చేతివాటం చూపించారు.
ఇద్దరు దొంగల అరెస్టు
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్కాడ్, ఫింగర్ ప్రింట్ సహాయంతో నిందితులను శనివారం శ్రీకాళహస్తి వెంకటగిరి బస్టాండ్ వద్ద అదుపులో తీసుకొన్నారు. వీరివద్ద నుంచి రూ 65,500 నగదు, బంగారం 28 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పట్టణ డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ కొత్తవారిని పనిలో పెట్టుకునేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకొవాలని సూచించారు.