సీఎం వర్సెస్ సీఎస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సీఎం వర్సెస్ సీఎస్

విజయవాడ, ఏప్రిల్ 23, (way2newstv.com)
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోనే వుంది. అయినా కానీ సాధారణ ప్రభుత్వం లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. కానీ ఆయనకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రూపంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం అడ్డుగోడగా నిలిచారు. బాబు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బూతద్దంలో చూస్తూ అధికారపార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. దీంతో అసలే ఎన్నికల తరువాత ఫలితాల టెన్షన్ లో వున్న చంద్రబాబుకు చిర్రెత్తికొస్తుంది. 


 సీఎం వర్సెస్ సీఎస్

ఉప్పు నిప్పులా వున్న బాబు వర్సెస్ సీఎస్ యుద్ధం మరో నెలరోజులపాటు నాన్ స్టాప్ గా కొనసాగే పరిస్థితి స్పష్టం అవుతుంది.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఆర్ధిక శాఖ తీరుపై కన్నేసిన వైనం అధికారపార్టీ కన్నెర్ర చేసేలా చేసింది. అడ్డగోలుగా కేటాయింపులను ప్రశ్నిస్తూ సిఎస్ ఆర్ధిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాంతో హడావిడిగా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సీన్ లోకి వచ్చారు. అసలు కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై సిఎస్ కు సమీక్షించే అధికారం లేనేలేదని ఒక లేఖ రాయడం చర్చనీయాంశం గా మారింది.కేబినెట్ కింద పనిచేసే సిఎస్ తాము తీసుకునే నిర్ణయాలను ఎలా ప్రశ్నిస్తారని ఆయన నిలదీయడంతో ఈ వివాదం మరికొంత కాలం నడిచేలాగే వుంది. తమ అనుకూల సిఎస్ కు ఎలక్షన్ కమిషన్ చెక్ పెట్టి సుబ్రమణ్యాన్ని నియమించిన రోజునుంచి అధికారపార్టీకి నిత్యం ఇబ్బందులే ఎదురౌతున్నాయి. ఆర్థిక శాఖ అడ్డగోలుగా చంద్రబాబు తాయిలాలకు నిధులు వెచ్చించిందన్నది సీఎస్ ఆరోపణ. దీనిని ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పడుతున్నారు. దీనికి శుభం కార్డు ఎక్కడ పడుతుందో చూడాలి.