జాతీయ రాజకీయాల్లో పట్టు కోసం బాబు..వ్యూహాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జాతీయ రాజకీయాల్లో పట్టు కోసం బాబు..వ్యూహాలు

విజయవాడ, ఏప్రిల్ 23, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదిహేను రోజులు దాటినా... ఫలితాలు రావడానికి మరో నెల టైం ఉన్నా... ఆ రాష్ట్రంలో రాజకీయాల వేడి ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ అధినేత జగన్ ఎన్నికలు ముగిసిన తర్వాత... జాతీయ రాజకీయాల జోలికి వెళ్లట్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రెండు, మూడో దశల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల్ని చుట్టేశారు. కర్ణాటకలో మిత్రపక్షం జేడీఎస్, తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే తరపున ఎన్నికల ప్రచారం సాగించారు. మూడో దశలోనూ అదే జోరు కొనసాగించారు. మిగతా నాలుగు దశల్లో కూడా చంద్రబాబు ఇదే విధంగా దేశమంతా తిరిగి ఆయా రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం సాగిస్తారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అది తమకు ఏమాత్రం కలిసిరాదనీ, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి మరిన్ని కష్టాలు తెస్తారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. 


జాతీయ రాజకీయాల్లో పట్టు కోసం బాబు..వ్యూహాలు

ఒకవేళ ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే, అప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే, అప్పుడు టీడీపీ నేతలకు మరిన్ని కష్టాలు తప్పవని చంద్రబాబు లెక్కలేసుకున్నట్లు తెలిసింది.ఏపీలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తమకు చాలా వరకూ కలిసొస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే, ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, అది తమకు స్వర్ణయుగంగా భావిస్తున్న చంద్రబాబు... ఒకవేళ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోయినా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతూ... రాష్ట్రంలో టీడీపీకీ, ఆ పార్టీ నేతలకూ ఎలాంటి నష్టమూ కలగకుండా జాగ్రత్త పడొచ్చని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిసింది.ఇవన్నీ ఆలోచించిన చంద్రబాబు... ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం రాకూడదన్న కృతనిశ్చయంతో దేశవ్యాప్త పర్యటనలకూ, ప్రచారాలకూ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. ఈసారి బీజేపీకి సొంతంగా మెజార్టీ రాదనీ, కానీ మిత్రపక్షాలతో కలిసి మళ్లీ బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీడీపీ అంతర్గత సర్వేలో తేలినట్లు సమాచారం. ఐతే... గట్టిగా ప్రయత్నిస్తే, బీజేపీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టడం పెద్ద కష్టమేమీ కాదనీ, ఆల్రెడీ ఉత్తరాది రాష్ట్రాల్లో (హిందీ బెల్ట్) బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఏలాగూ బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు లేవని భావిస్తున్న చంద్రబాబు... ప్రతీ రాష్ట్రంలోనూ జరిగే, ప్రతీ విడత ఎన్నికల్లోనూ నరేంద్ర మోదీ టార్గెట్‌గా బలమైన వ్యతిరేక ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకోవడం వల్లే, ఆయన నిరంతరం పర్యటనలు సాగిస్తున్నారని తెలిసింది.