కౌతళం ఏప్రిల్ 8 (way2newstv.com)
మండల కేంద్రంలో సోమ వారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడవ విడత తహశీల్దార్ వసంత కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. హోసింగ్ ఏఈ కేశవ రెడ్డి, ఈఓఅర్డి సూర్యనారాయణ, పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలో 69 పోలింగ్ కేంద్రాల్లో , 52,982 మంది ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 25,960 ఓటర్లు, మహిళలు 27,022 ఓటర్లు ఉన్నారని అదికారులు తెలిపారు.
పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు
ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 7 మంది అధికారులు ఉంటారని ఓటర్లకు అన్ని వసతులు కల్పిస్తామని వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పిస్తామని వారికి వాలంటీర్లు సహాయ సహకారాలు అందిస్తారని ఓటర్లు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే టట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అధికారులకు సహకరించాలని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని ఏఎస్ఓ సూర్యప్రకాష్ తెలిపారు. పిఓ , ఓపిఓలు కీలకమైన పాత్రలు వహిస్తారని తెలిపారు. ఎన్నికల అధికారులు ఏ పార్టీ నాయకులకు వత్తాసు పలకకుండా అన్ని పార్టీల నాయకులను సమానంగా చూడాలని ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా తమ విధులను సూచించారు. ఈ కార్యక్రమాలకు మండలం లో అన్ని ప్రభుత్వ అధికారులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.