కొలంబో ఏప్రిల్ 26 (way2newstv.com),
శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ డే రోజున జరిగిన పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ ఆదేశ రక్షణశాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గురువారం అందించారని.. రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
బాంబు పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణశాఖ కార్యదర్శి రాజీనామా
ఇంటెలిజెన్స్ హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే దాడులు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెర్నాండో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్టు అధ్యక్షుడికి రాసిన లేఖలో ఫెర్నాండో తెలిపారని.. ఆ అధికారి తెలిపారు.కాగా ఈ నెల కొలంబో లోని చర్చిలు,హోటల్స్ లలో వరుస బాంబు పేలుల్లలో 360 మంది చని పోయిన విషయం తెలిసిందే.