హైదరాబాద్, ఏప్రిల్ 20 (way2newstv.com)
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి. రాబోయే మూడు రోజులలో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వర్షాలు వచ్చే అవకాశం వుంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో మార్కెట్ యార్డులలో కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే గోదాములకు తరలించండని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులకు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
జాగ్రత్తలు తీసుకోండి
అమ్మకానికి వచ్చిన ధాన్యం వర్షాలకు తడవకుండా ఏర్పాట్లు చేయండి. రాత్రివేళ యార్డులలో కరెంటు ఇబ్బందులు లేకుండా బ్యాటరీ లైట్లు అందుబాటులో ఉంచుకోండని అన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా విరివిగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోండి. ఐకేపీ కేంద్రాలలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాటు చేసిన వసతులలో లోపాలు లేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.