విశాఖ టెక్కీ ఐడియా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖ టెక్కీ ఐడియా

విశాఖపట్టణం, ఏప్రిల్ 2, (way2newstv.com)
విశాఖపట్నానికి చెందిన ఓ టెక్కీ నీటిలో మునిగిపోయేవారిని రక్షించే సరికొత్త వాటర్ డ్రోన్‌ను కనిపెట్టారు. సైఫ్ ఆటోమేషన్ సర్వీసెస్ (ఎస్ఏఎస్) సహ వ్యవస్థాపకుడు, అలియాసాగర్ కల్కతావాలా తయారు చేసిన ఈ డ్రోన్ రిమోట్ సాయంతో పనిచేస్తుంది. 12 కిలోలు బరువుండే ఈ డ్రోన్ గుర్రపునాడ రూపంలో లైఫ్‌గార్డులా ఉంటుంది. ఇది నీటిలో గంటకు 13 కిమీలు చొప్పున ప్రయాణించగలదు. 


విశాఖ టెక్కీ ఐడియా

ఇది సుమారు 300 కిలోల బరువును మోయగలదు. రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే దీని రిమోట్ 3 కిమీల వరకు సిగ్నల్స్‌ను తీసుకుంటుందని, అవసరమైతే సామర్థ్యాన్ని 10 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చని అలియాసాగర్ తెలిపారు. నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తులను గుర్తించి వెంటనే ఈ వాటర్ డ్రోన్ వారి వైపుకు పంపించినట్లయితే.. వారు దీన్ని పట్టుకుని బయటకు వచ్చేయొచ్చని పేర్కొన్నారు. భారత నావికా దళంతోపాటు పలు మున్సిపాలిటీలు కూడా ఈ డ్రోన్లను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. ఈ డ్రోన్ అందుబాటులో ఉంటే గజ ఈతగాళ్లు నీటిలోకి వెళ్లకుండానే బాధితులను రక్షించవచ్చని తెలిపారు