విజయవాడ 26 (way2newstv.com)
ఏపీలో ప్రజలు కష్టాలు పడుతుంటే, రాబోయే ఎన్నికల ఫలితాలపై రాజకీయ నేతలు బెట్టింగ్ ల్లో మునిగిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు.
కష్టాల్లో ప్రజలు..బెట్టింగ్ ల్లో నేతలు :తులసిరెడ్డి
విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో కరవు విలయతాండవం చేస్తోందని, వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. టీడీపీ లేదా వైసీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. మే 23 తర్వాత పెట్రోల్, డీజిల్ లీటర్ ధరలు రూ.100 మార్క్ దాటబోతున్నాయని అభిప్రాయపడ్డారు.