తన కుమారుడు సాయికిరణ్‌ను ఆదరించి గెలిపించండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తన కుమారుడు సాయికిరణ్‌ను ఆదరించి గెలిపించండి

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్‌ ఏప్రిల్ 4 (way2newstv.com)
సికింద్రాబాద్ తెరాస పార్లమెంట్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌కు మద్దతుగా ఆయన తండ్రి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే  దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ లోని మక్తాలో రోడ్ షో నిర్వహించిన వారు... కారు గుర్తుకు ఓటు వేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా సాయి కిరణ్ యాదవ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. 


తన కుమారుడు సాయికిరణ్‌ను ఆదరించి గెలిపించండి 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ... వారి ప్రచారం కొనసాగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని తెరాస కైవసం చేసుకుంటుందని మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.అనంతరం ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్ఎన్ సీసీ క్లబ్‌లో ఆ క్లబ్ సభ్యులు, చలన చిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు, చిత్రపురి హిల్స్ కాలనీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో కలిసి ప్రత్యేకంగా సమావేశమైన తలసాని....తన కుమారుడు సాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనలాగే తన కుమారుడు సాయికిరణ్‌ను ఆదరించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగాగెలిపించాలనిఈ సందర్భంగా సినీ ప్రముఖులను కోరారు.