దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు

జిల్లా కలెక్టర్  శ్రీదేవసేన 
పెద్దపల్లి  ఏప్రిల్ 10 (way2newstv.com):
పోలింగ్  కేంద్రాల వద్ద దివ్యాంగులకు  ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని జిల్లా పాలనాధికారి మరియు  పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీదేవసేన  బుధవారం  ఒక ప్రకటనలో తెలిపారు.   పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో   పెద్దపల్లి, మంథని మరియు  రామగుండం (3) అసెంబ్లీ  సెగ్మెంట్లు కలవు .  పెద్దపల్లి అసెంబ్లీ  సేగ్మేంట్  పరిదిలో (287)  పోలింగు కేంద్రాలు, మంథని అసెంబ్లీ  సేగ్మేంట్ పరిధిలో (288) పోలింగు కేంద్రాలు మరియు  రామగుండము అసెంబ్లీ  సెగ్మెంట్ పరిధిలో (259) పోలింగ్ కేంద్రాలు  మొత్తం 834 పోలింగు కేంద్రాలలో 9190 దివ్యాంగ ఓటర్లు ఉన్నారని,  ఏప్రిల్ 11,2019న  జరుగనున్న లోకసభ ఎన్నికలలో 100 శాతం దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు అన్ని పోలింగ్ కేంద్రాలకు దివ్యాంగులను మరియు వయోవృద్దులను తిసుకోవచ్చి మరియు ఇంటికి పంపించడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించనైనదని,  


దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు 

పోలింగ్ కేంద్రముల వద్ద  లోకేషన్ల వారిగా 477 వీల్ చైర్లను ఎర్పాటు చేసామని,  ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని మరియు ప్రత్యేక క్యూలైన్లను  ,ఓటర్లకు ఇబ్బంది కలుగకుండా 834 మంది దివ్యాంగ సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందని,  దివ్యాంగులను బూతుల వారిగా మ్యాపింగ్ చేయడం జరిగిందని,  అందులు పోలింగు కేంద్రమునకు వచ్చినప్పుడు చూసుకోనుటకు బ్రెయిలీ బ్యాలేట్ పేపర్లు అందుబాటులో ఉంచడం జరిగిందని, దృష్టిలోపం కలవారికి బ్రెయిలీ  ఓటరు గుర్తింపు కార్డు అందించామని,  ప్రభుత్వేతర సంస్థల సహకారముతో దివ్యాంగులు అందరు ఓటు  హక్కు వినియోగించుటకు ఎర్పాట్లు చేసామని,  దివ్యాంగుల ప్రత్యేక అవసరాల పై  పోలింగ్ అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని, పోలింగు కేంద్రాలకు వచ్చిన తరువాత ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు  అత్యవసర సేవల కొరకు వైద్యా సిబ్బందిని ఏర్పాటు చేయడము జరిగినది . దివ్యాంగులు ఓటు ఎలా వేయడము పై కరపత్రాల ఇవ్వడం జరిగిందని,  దివ్యాంగుల సంక్షేమ శాఖలో 21  రకాల వైకల్యాలను గుర్తించి, అట్టి దివ్యాంగులు అందరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవలసిందిగా  కలెక్టర్ ఆ ప్రకటనలో  కోరారు.