ఏపీలో అవినీతి పెరిగింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో అవినీతి పెరిగింది

విజయవాడ, ఏప్రిల్ 3, (way2newstv.com)
గత ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఏపీ విభజన చట్టాన్ని 2014 ఆర్ధిక సంఘం ప్రస్తావించలేదని నరేంద్ర మోడీ అమలుచేయ లేదు. రాష్ట్రానికి దారుణమైన వివక్ష బీజేపీ చూపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. బుధవారం అయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గోన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం మొట్టమొదటిసారి రాష్ట్ర బంద్ నిర్వహించింది కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే. విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని మా ఎజెండా. రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ కు,  కార్పొరేట్ విద్య లకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ముకాస్తోందని విమర్శించారు. 


ఏపీలో అవినీతి పెరిగింది

అవినీతి లంచగొండితనం తాండవిస్తున్నాయి. నెల్లూరు రవాణా శాఖ అటెండర్,  విజయవాడలో రెవిన్యూ అధికారులవద్ద వందలకోట్లు నల్ల ధనం బయటపడింది. రాజకీయాలలో నైతికత నిబద్దత ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, నలుగురు  పార్లమెంట్ సభ్యులను పార్టీలోకి ఆహ్వానించారు.  రాష్ట్ర రాజకీయాన్ని భ్రష్ఠు పట్టించారని మండిపడ్డారు. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నట్లుంది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులపై నిఘా లేదని అన్నారు. వేలకోట్ల ధనప్రవాహాన్ని మీరు ఎలా  అడ్డుకున్నారు. ఎవరిపైన మీరు చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియచేయగలరా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ వ్యవహారశైలి ఏమి బాగోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోటానికి అందరూ ముందుకు రావాలి సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నామని అయన అన్నారు.  క్రొత్త రాజకీయాలకు నాంది పలకాలి ప్రజలు గెలవాలి ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వాలు రావాలని కోరుతున్నాన్నారు.