విజయవాడ ఏప్రిల్,05 (way2newstv.com):
చంద్రబాబు కి ఓటు వేస్తే 40 ఏళ్ళు ఏపీ వెనక్కి వెళ్తుంది. గ్రాఫిక్ మాయాజాలం తో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నాడు. 6 లక్షల కోట్లు కేంద్రం ఏపీ కి ఇస్తే నిధులన్నీ మింగేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ఇసుక దందా పై100 కోట్లు ఫైన్ వేసింది.
గ్రాఫిక్ తో చంద్రబాబు మోసం
ఎక్కడకక్కడి ఇసుక తవ్వేసి 40 వేల కోట్లు దోచేశారు. చంద్రబాబు కి ఓటు వేస్తే ఏపీ అధోగతి పాలేనని అన్నారు. భారతదేశ రాజకీయల్లో ఎవరినన్న బహిష్కరించాల్సి వస్తే ముందుగా చంద్రబాబు ని బహిష్కరించాలి.. ప్రశ్నిస్తానని వచ్చిన నాయకుడు ప్రశ్న గా మిగిలిపోయాడని అన్నారు. పవన్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. 2014 లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేద్దాం అంటే పవన్ ఒప్పుకోలేదు.. టీడీపీ కి మద్దతు పలికాడు. ఏపీ లో ఇపుడున్న పరిస్థితి కి కారణం పవన్ కళ్యాణ్ అని అన్నారు. సామాజిక వర్గాలు విచ్చిన్నం అవటానికి కారణం పవన్. వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేయగల ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు. అవినీతి చేసిన వాళ్లే సీబీఎన్ ఆర్మీ సభ్యులని అన్నారు.