వైభవంగా చంద్రగిరి శ్రీ కోదండరాముడి చక్రస్నానం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైభవంగా చంద్రగిరి శ్రీ కోదండరాముడి చక్రస్నానం

తిరుపతి, ఏప్రిల్ 23, (way2newstv.com)
చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) నేత్రపర్వంగా జరిగింది.  ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 


వైభవంగా చంద్రగిరి  శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు. ఇందులో  సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు.  అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.