భువనగిరిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భువనగిరిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

భువనగిరి,ఏప్రిల్,10, (way2newstv.com):
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండువేల 68  పోలింగ్ కేంద్రాలను పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ఐదు జిల్లాలకు సంబంధించిన పార్లమెంటరీ లో 42 ప్రత్యేక బృందాలతో ఎన్నికలను ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు 16 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యే విధంగా ,ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పోలింగ్ కేంద్రాల వద్ద వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు 


 భువనగిరిలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ మరియు ఒక మహిళ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 9,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లను కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ఎన్నికలు జరిగే సమయంలో ఈవీఎంల సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా ప్రత్యేక చేశామని తెలిపారు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో 450 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గా తీసుకున్నట్లు పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి ఇ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ గారు తెలిపారు ఈ రోజు సాయంత్రం నుండి 144 సెక్షన్ అమలు అవుతుందని ఇలాంటి ప్రచారాలు కూడా నిర్వహించవద్దని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్  తెలిపారు..