తుగ్గలి, ఏప్రిల్ 23, (way2newstv.com)
బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి కాలం సెలవులు ప్రకటిస్తున్నట్టు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.
నేటి నుంచి పాఠశాలలకు వేసవికాలం సెలవులు... ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు
మంగళవారం అయన మాట్లాడుతూ బుధవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి కాలం సెలవులు ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 49 రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించడం జరిగిందని అన్నారు. జూన్ 12, బుధవారంన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని అన్నారు.