కాకినాడ,ఏప్రిల్ 24 (way2newstv.com)
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలో పలువురు వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని వడ్డీ వ్యాపారి నిమ్మకాయల సత్యనారాయణ ఇల్లు, రొయ్యలమేత షాపులు అలాగే అల్లవరం మండలం కోడూరుపాడులో ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రంలో సోదాలు చేపట్టారు. మరోపక్క అమలాపురం పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆసెట్టి ఆదిబాబు, ఉప్పలగుప్తం మండలం గోపవరం గ్రామంలోని ఆకుల చంటి ఇంటిలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.
వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు
ఈ సోదాలు కొనసాగాయి. ఆదాయపన్ను శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఎం.వి.రమేష్ ఆధ్వర్యంలో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు సుమారు ఆరు చోట్ల సోదాలు చేశారు. గత నెలలో పట్టణంలోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో జరిగిన సోదాలకు ఇవి కొనసాగింపుగా జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ ఐటీ దాడుల నేపథ్యంలో అమలాపురం పట్టణంలోని ఆక్వా రైతులతో పాటు, వడ్డీ వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నట్లు సమాచారం.