మండుటెండలతో ప్రజల ఇబ్బందులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మండుటెండలతో ప్రజల ఇబ్బందులు

అదిలాబాద్, ఏప్రిల్ 12 (way2newstv.com)
మండుటెండలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం 43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పట్టణంలోని వీధులు సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు ఉదయం 10 దాటితే ఇండ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయా కార్యాలయాల్లో ఉన్న అధికారులు, సిబ్బంది మధ్యా హ్న భోజన విరామ సమయంలో కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండ కారణంగా జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చే బస్సులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. 


మండుటెండలతో ప్రజల ఇబ్బందులు

ఉదయం 11నుంచి సాయంత్రం 4-5గంటల వరకు పట్టణంలోని ప్రధాన మార్కెట్ రోడ్లలో జన సంచారం ఉండడం లేదు. దీంతో వ్యాపారులు గిరాకీ లేక నిస్తేజంగా కూర్చోని ఉండాల్సి వస్తున్నది. తీవ్రమైన ఎండలకు పండ్లరసాలు, కొబ్బరి బోండాలు, సోడా, శీతల పానియాల అమ్మకాలు పదింతలు పెరిగిపోయాయి. అలాగే గ్రామాల్లో రైతులు, కూలీలు, ఇతర జీవనోపాధి వారు అవసరమైన పనులను ఉదయం 11గంటల్లోపే ము గించుకొని ఇండ్లకు తిరిగి వచ్చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధిహామీ పనులు కూడా ఉద యం 11గంటలలోపే పూర్తి చేసుకొని కూలీలు ఇండ్లకు వచ్చేస్తున్నారు. తీవ్రమై న ఎండల కారణంగా సం బంధిత ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది తగు సూచనలు చేస్తున్నారు.