మళ్లీ సినిమాల్లో నాగబాబు బిజీ బిజీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ సినిమాల్లో నాగబాబు బిజీ బిజీ

హైద్రాబాద్, ఏప్రిల్ 23, (way2newstv.com)
రెండో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఎవరికి వారు ఎలక్షన్స్‌లో తమదే గెలుపు అంటున్నారు. ఇందులో జబర్థస్త్ జడ్జెస్‌గా ఉన్న నాగబాబు, రోజాలు పోటీ చేస్తోన్న స్థానాలపై అందరికీ ఆసక్తి నెలకొంది. ఇక జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు..ఎన్నికల్లో తను గెలిచిన గెలవక పోయిన జబర్థస్త్ ప్రొగ్రామ్‌ను ఒదిలి పెట్టనని తన ఫేస్‌బుక్ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే కదా.. నాగబాబు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో శేఖర్ మాస్టర్ జబర్థస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక తాను ఎంపీగా గెలిచిన జబర్థస్త్ ప్రోగ్రాంను విడిచిపెట్టేది లేదని చెప్పారు. 


మళ్లీ సినిమాల్లో నాగబాబు బిజీ బిజీ

అదే సమయంలో సినిమాలు మాత్రం చేయనని చెప్పాడు. అంతేకాదు ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా నర్సాపురం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు. సినిమాలకు గుడ్ బై చెబుతానన్న నాగబాబు.. మరో సినిమాలో లీడ్‌ రోల్లో యాక్ట్ చేయడమే కాదు..ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. కొన్నేళ్లుగా టీవీ షోస్‌తో పాటు సినిమాల్లో కనిపిస్తోన్న నాగబాబు..తాజాగా ‘ఏదైనా జరగొచ్చుఝ’ అనే హార్రర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈసినిమాను నాగబాబే లీడ్ రోల్లో నటిస్తున్నట్టు ఈ టీజర్‌ను బట్టి తెలుస్తోంది. తాాజాగా విడుదలైన ఈ టీజర్‌లో మెగా బ్రదర్ ఫినిషింగ్ టచ్ మాములుగా లేదు. కే.రమాకాంత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను కే.ఉమాకాంత్ నిర్మించారు. చూస్తుంటే నాగబాబు..ఈ సినిమాను ఎన్నికల ముందే ఫినిష్ చేసినట్టు కనబడుతోంది. ఏమైనా ఎన్నికల రిజల్ట్ వచ్చాకా సినిమాల్లో నటించనన్న తన మాటను ఏ మేరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.