మహబూబ్ నగర్, ఏప్రిల్ 2, (way2newstv.com):
తెరాసకు ఓటేస్తే భాజాపా కు వేసినట్లే అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మహబూద్ అలీ విమర్శించారు. తెలంగాణలో భాజపాను బొంద పెట్టడమే తెరాసా లక్ష్యమని అయన అన్నారు.. మంగళవారం నాడు అయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలసి స్థానిక మోతీనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూద్ అలీ మాట్లాడుతూ సీయం కేసీఆర్ లాంటి నాయకులు ప్రపంచంలో అరుదుగా ఉంటారన్నారు.. 45 ఏళ్ల తరువాత సీయం కేసీఆర్ ముస్లింలకు డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించారన్నారు.
కేసీఆర్ జిమేధార్
టీఆర్ యస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. కాబట్టే సీయం పిలిచి మరీ టికెట్టు ఇచ్చారన్నారు. అలాంటి వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ చౌకిదార్ అంటూ వచ్చి పాలమూరు గురించి ఒక్క మాట మాట్లాడకుండా కులమతాల భావోద్వేగాలను రెచ్చ గొట్టే ప్రయత్నం చేసి ఉడాయించారన్నారు. రాహుల్ గాంధీ వచ్చి టెకేదార్ అంటూ వచ్చి వెళ్లిపోయారన్నారు. మనక్కావాల్సింది చౌకిదార్, టెకేదార్ కాదని జిమేధార్ కావాలని, మన జిమేధార్ కేసీఆర్ అనగానే సభ ఒక్కసారిగా జై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తింది. గత 70 ఏళ్ల లో ముస్లింలు ఎక్కువ ఉన్న కాశ్మీర్ లో కూడా చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.