శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 08 (way2newstv.com)
సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గంలోని నల్లకుంట లో టీఆర్ఎస్ పార్టీ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ కారు గుర్తకు ఓటు వేసి గెలిపించాలని శిశుసంక్షేమ శాఖ ఆర్గనైజర్, మహీళా రాష్ట్ర నాయకురాలు సుశీలారెడ్డి ఓటర్లను కోరారు.
టిఆర్ ఎస్ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలి
ఈ సందర్భంగా సుశీలారెడ్డితోపాటు సుచితారావు తదితరులు ఉదయంనుండే ఎన్నికల ప్రచారం చేపట్టి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అంబర్ పేట నియోజకవర్గం నుండి టిఆర్ ఎస్ ఎంపి అభ్యర్థి కి ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు. ఇంటింటా ప్రచారంలో ప్రజలనుండి మంచి స్పందనవస్తుందన్నారు.