విజయవాడ, ఏప్రిల్ 5 (way2newstv.com)
రాజకీయాల్లో భిన్న ఆలొచనలు ఉంటాయి. ఒకే పార్టీలో ఉన్న వారి మధ్యన కూడా ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి. అలాంటిది రాత్రికి రాత్రి పొత్తులు పేరిట ఓట్ల గేలం కోసం కలసిన పార్టీల మధ్య ఎన్ని గొడవలు అయినా ఉంటాయి. మాది ఒకే రకమైన ఆలోచన అని చెప్పుకున్న వారి అసలు ఆలోచనలు ఏంటో వారి మాటల్లో చేతల్లో కూడా బయటపడిపోతాయి.మాయావతిని ప్రధానిగా చూడాలని ఉంది అంటున్నారు పవన్, పవన్ని ఏపీ సీఎం గా చూడలని ఉంది అంటున్నారు మాయావతి. అయితే ఈ ఇద్దరూ ఏపీలో నిర్వహించిన సభల్లో మాత్రం వారు చేసిన విమర్శలు, వారి టార్గెట్లు చూస్తే ఈ కాంబో ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. పవన్ కి ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రత్రర్ధులు అయినా ఆయన మాత్రం వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు.
పవన్ ను ఇరకాటంలో పడేసిన బెహన్ జీ
జగన్ మీదనే బాణాలు వేస్తున్నారు. మరో వైపు కేసీఅయార్, టీయారెస్ అంటూ బాబు మాటలనే వల్లిస్తూ అధికారంలో ఉన్న చంద్రబాబుని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఇదే సభల్లో మాట్లాడిన మాయావతి మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేసుకుని హాట్ కామెంట్స్ చేయడం విశేషం. ఆమె జగన్ని కానీ, కేసీయార్ ని కాని పల్లెత్తు మాట అనకపోవడం విశేషం. ఎందుచేతనంటే ఏపీలో రాజకీయ పరిణామలు, ప్రజల నాడి బాగా తెలుసుకున్న మీదటనే మాయావతి జగన్ని ఏమీ అనలేదని అంటున్నారు. రేపటి రోజున కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రకపోతే జగన్, కేసీయార్ సాయంతో తన ప్రధాని కలను నెరెవేర్చుకోవాలని మాయావతి అనుకుంటున్నారు. మాయావతి ఫోకస్ పూర్తిగా బాబు, కాంగ్రెస్ మీదనే ఉంచి ఏపీ సభల్లో విమర్శలు చేశారని అంటున్నారు. మొత్తానికి ఏపీలో మాయావతిని తీసుకువచ్చి పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలనుకున్న పవన్ కి మాయా వ్యూహం అర్ధం కాకుండా పోయిందని అంటున్నారు.