కరీంనగర్, ఏప్రిల్ 1(way2newstv.com)
విద్యుత్తు సంస్థలో జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి ఇంటర్వూలు నత్తనడకన సాగుతుండటంతో కిందిస్థాయి సిబ్బంది లేకుండానే అన్‌మ్యాన్డ్ కార్మికులతో పనులు చక్కబెడుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి నెలకొంది.. విద్యుత్తు సంస్థ యాజమాన్యం అడ్డగోలుగా పదోన్నతులు కల్పించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిందిస్థాయి సిబ్బందిని భర్తీ చేయకుండానే పై స్థాయిలో కొత్త పోస్టులు, కొత్త సెక్షన్లు ఏర్పాటు చేశారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన పేరిట కొత్త జిల్లాలు చేయడంతో వాటికి అనుగుణంగా సర్కిల్, డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ కొత్త సెక్షన్లను ఏర్పాటు చేశారు. దీనికోసం ఉన్న వారందరికీ పదోన్నతులు కల్పించారు.2017 ఆగస్టు 11న రాష్ట్ర వ్యాప్తంగా 3151 కొత్త పోస్టులను మంజూరు చేశారు. డీఈలను ఎస్‌ఈలుగా, ఏడీఈలను డీఈలుగా, ఏఈలను ఏడీఈలుగా పదోన్నతులు ఇచ్చేశారు. ఇలాగే క్షేత్రస్థాయిలో పదోన్నతులు వచ్చాయి. కరీంనగర్ సర్కిల్ పరిధిలో లైన్ ఇన్‌స్పెక్టర్ 45, లైన్‌మెన్ 87, అసిస్టెంట్ లైన్‌మెన్ 136, జూనియర్ లైన్‌మెన్ 223 పోస్టులు కొత్తగా కేటాయించారు. దీనికోసం ఉన్న సిబ్బందికి పదోన్నతులు ఇచ్చేశారు. దీంతో జూనియర్ లైన్‌మెన్లు అసిస్టెంట్ లైన్‌మెన్లు, వారికి లైన్ ఇన్‌స్పెక్టర్లుగా సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లుగా, ఫోర్‌మెన్లుగా పదోన్నతులు ఇచ్చారు. కింది స్థాయి సిబ్బంది అందరికీ పదోన్నతులు వచ్చాయి.
ఈ నిర్లక్ష్యం ఖరీదు చాలా ఎక్కువ.. (కరీంనగర్)
దీనికి అనుగుణంగా కొత్తగా సిబ్బందిని భర్తీ చేయలేదు. దీంతో కొత్తగా ఏర్పడిన కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో పరిధిలోనే 230 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో 673 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి జనవరిలో విద్యుత్తు స్తంభం ఎక్కే పరీక్షలు నిర్వహించారు. కానీ భర్తీ ప్రక్రియ పూర్తికాలేదు.అడ్డగోలుగా పదోన్నతులు ఇవ్వడంతో కింది స్థాయి సిబ్బంది కొరత నెలకొంది. చొప్పదండి మండలం అర్నకొండ సెక్షన్ పరిధిలో కాట్నపల్లి కేంద్రంగా సాంబయ్యపల్లి, కోనేరుపల్లి, మల్లన్నపల్లి, గుమ్లాపూర్ గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లో విద్యుత్తు సర్వీసులు నిర్వహించడానికి లైన్‌ఇన్‌స్పెక్టర్, లైన్‌మెన్, ఏఎల్‌ఎం, జేఎల్‌ఎం పోస్టులు ఉండాలి. కానీ పదోన్నతులు ఇవ్వడంతో ఒక్క లైన్ ఇన్‌స్పెక్టర్ మాత్రమే మిగిలిపోయారు. ఇటీవల సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ సైతం పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు సైతం ఖాళీ అయ్యింది. ఆ లైన్‌మెన్ కింది స్థాయి సిబ్బంది లేక ఐదు గ్రామాల్లో సర్వీసులు నిర్వహించలేక ఏడాది ముందే పదవీ విరమణ పుచ్చుకొని ఇంటి దారి పట్టారు. ఇటీవల డివిజన్ విభజనలో సీనియర్, జూనియర్ బదిలీల్లో లైన్‌ఇన్‌స్పెక్టర్ కొత్తగా చేరారు. ఒక్క లైన్ ఇన్‌స్పెక్టర్ ఆ ఐదు గ్రామాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఆయనకు సహాయకులుగా అన్‌మ్యాన్డ్ సర్వీసు కార్మికులను విద్యుత్తు సంస్థ అందించింది.కింది స్థాయి సిబ్బంది లేకపోవడంతో విద్యుత్తు సంస్థ ప్రతి సెక్షన్‌కు నలుగురి చొప్పున అన్‌మ్యాన్డ్ సర్వీసు వర్కర్ల పేరిట వారికి రూ.3వేల వేతనంతో నియమించారు. ఇంటింటికి తిరిగి బకాయిలు వసూలు చేయడం, విద్యుత్తు సిబ్బందికి సహాయకులుగా ఉండటం వారి విధి.. కానీ వారితోనే విద్యుత్తు సిబ్బంది చేయాల్సిన పనులన్నింటిని చక్కబెడుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో వారు క్షతగాత్రులు, విగత జీవులుగా మారుతున్నారు. కరీంనగర్‌లోని సెక్షన్ 7లో రఘు అనే అన్‌మ్యాన్డ్ సర్వీస్ కార్మికుడు విద్యుత్తు మీటర్ మార్చే క్రమంలో విద్యుదాఘాతం రావటంతో కిందపడి చెయ్యి విరిగింది. దీంతో ఉపాధికి ఎసరు వచ్చింది. ఇలాగే శనివారం చామనపల్లిలో జరిగిన సంఘటనలో అన్‌మ్యాన్డ్ సర్వీస్ వర్కర్ అశోక్ మృతి చెందారు.
విద్యుత్తు సంస్థ కింది స్థాయి సిబ్బందికి పదోన్నతులు రావడంతో వారిలో దర్పం వస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్తు స్తంభాన్ని జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్లు మాత్రమే ఎక్కుతారని, లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షిస్తారన్న సంప్రదాయం విద్యుత్తు సంస్థలో నాటుకుపోయింది. ప్రస్తుతం కింది స్థాయి సిబ్బంది జేఎల్‌ఎం, ఏఎల్‌ఎంలు లేని సమయంలోనైనా స్తంభం ఎక్కడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రైవేట్ కార్మికులైన అన్‌మ్యాన్డ్ సర్వీస్ కార్మికులతోనే అన్ని పనులు చేయిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు ప్రమాదాలకు లోనైతే వారి కుటుంబ సభ్యు