టంగుటూరు లో దారుణం
కర్నూలు. ఏప్రిల్ 24 (way2newstv.com)
కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త భార్యను అత్యంత కిరాతకంగా తలపై రోకలి బండతో మోది హత్య చేసిన ఘటన బుధవారం వేకువజామున చోటు చేసుకుంది. బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఏరువ మల్లేశ్వరి ని ఆమె భర్త ప్రసాద్ రెడ్డి తలపై రోకలి తో కొట్టడంతో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామానికి చెందిన ఏరువ మల్లేశ్వరి, ,ప్రసాద్ రెడ్డి లు భార్యాభర్తలు. 10 సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది .. వీరికి మనోజ్ , మహీధర్ అనే ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త
ప్రసాద్ రెడ్డి వివాహ శుభకార్యాలకు అందించే సేమియాన షాపు నిర్వహించడంతోపాటు, ఫోటో స్టూడియో ని కూడా నిర్వహిస్తున్నాడు.. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో అనుమానం చిచ్చు రేగింది. తాగుడుకు బానిసైన ప్రసాద్ రెడ్డి తరుచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం వేకువజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్య మల్లేశ్వరి పై భర్త ప్రసాద్ రెడ్డి రోకలిబండ తీసుకొని తలపై బలంగా కొట్టటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడ్నుంచి ప్రసాద్ రెడ్డి పారిపో యాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారులు భయాందోళనకు గురై ఏడుస్తూ ఉండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న నందివర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.