నాగర్ కర్నూలు, ఏప్రిల్ 10 (way2newstv.com)
నాగర్ కర్నూల్ నెల్లి కొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నందు నిర్వహించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను నాగర్ కర్నూల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు దినేష్ ప్రసాద్ పరిశీలించారు. నాగర్ కర్నూలు నెల్లికొండా వ్యవసాయ మార్కెట్ యార్డు నందు నిర్వహించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని 259 పోలింగ్ కేంద్రాలు,ఎన్నికల సామాగ్రి తో పాటు ఎన్నికల సిబ్బందిని, వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరవేసేందుకు 45 బస్సుల ఏర్పాటు చేసారు. నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,240 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు,
ఈవీఎంల పంపిణీని పర్యవేక్షించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు
ఇతర పోలింగ్ అధికారులు, తమకు పోలింగ్ కేంద్రాల ఎన్నికల సామాగ్రిని పరిశీలించుకోని సెక్టోరల్ అధికారుల సమక్షంలో తమ తమ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ఎన్నికల సామాగ్రి తీసుకొని రూట్ ల వారీగా కేటాయించిన బస్సుల్లో బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గానికి 23 సెక్టార్లుగా ఏర్పాటు చేసి ఒక సెక్టర్ కు ఒక సెక్టోరల్ అధికారిని నియమించి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వాహనానికి జిపిఆర్ఎస్ లొకేషన్ ఏర్పాటు చేసి సెక్టర్ అధికారి వాహనంలో వారితో పాటు నలుగురు సిబ్బందిని కేటాయించి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు 1000 సంఖ్య కన్న పైన ఉండే పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ లో ఉండే 100 మంది సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలలో అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు సెక్టోరల్ అధికారులకు కలెక్టర్ పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నిర్వహించారు. బస్సుల నిర్వహణ బాధ్యతలు ఆర్టీవో ఎర్రిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద సిబ్బందికి భోజన ఏర్పాట్లను జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు పర్యవేక్షించారు.