కొలోంబో ఏప్రిల్ 25, (way2newstv.com)
క్రైస్తవుల పండుగ ఈస్టర్ రోజున శ్రీలంక రాజధాని కొలోంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో నేపధ్యంలో మరోసారి గురువారం పేలుళ్లు జరిగాయి. ఆదివారం నాటి పేలుళ్లలో 359 మంది మరణించారు. దాదాపు ఐదు వందలమంది గాయాపడ్డారు. అదృష్టవశాత్తు గురువారం ఘటనలో ఏవరూ గాయాపడలేదు.
శ్రీలంకలో మళ్లీ పేలుళ్లు
కొలోంబోకు నలభై కిలోమీటర్ల దూరంలోని పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర వున్న ఖాళీ ప్రదేశంలో పేలుళ్లు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని, ఈ పేలుళ్లపై కొలోంబో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఆత్మాహుతి చేసుకున్న తొమ్మిదిమందిలో ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నట్లు గుర్తించారు. ముష్కరులంతా విద్యావంతులు, ఉన్నత కుటుంబాలకు చెందినవారే.